సె.మీ దూరం అయినా రాంగ్ రూట్ వద్దు, లేదంటే ఇలా, సైబరాబాద్ పోలీసుల సజెషన్….

రాంగ్ రూట్ వద్దు అని పోలీసులు చెబుతారు. కొన్ని చోట్ల దగ్గర ఉంటారు. ఫోటోలు తీస్తారు. కనిపిస్తే మందలిస్తారు.
అయినా నో యూజ్.. కొందరికీ ఆత్రం ఎక్కువ.. తొందరగా ఇంటికి వెళ్లాలి అనుకుంటారు.
తప్పు లేదు. ఇళ్లు/ ఆఫీసు నుంచి కాస్త ముందుగా బయల్దేరాలి. అంతే తప్ప.. టైమ్ లేదని.. రాంగ్ రూట్‌లో వెళితే మైలార్ దేవ్ పల్లిలో జరిగినట్టే జరుగుతుంది.
ఓ టూ వీలర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. కాస్త దూరం అయినా రైట్ వేనే బెస్ట్ అని సజెస్ట్ చేస్తున్నారు.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేసిన వీడియోలో.. ఓ టూవీలర్ వస్తున్నాడు. రాంగ్ రూట్‌లోనే వస్తున్నాడు. సరే అనుకుందాం.. అతని తలకు హెల్మెట్ కూడా లేదు. త్వరగా ఇంటికి వెళ్లాలని అనుకొని తిరగిరానీ లోకాలకు వెళ్లిపోయాడు. అటు వస్తోన్న కారు వేగంగా అతనిని ఢీ కొంది. కారు వాడి తప్పు స్పీడ్ ఒక్కటే.. కానీ అదీ రైట్ రూట్ కదా అనే వారు ఉండొచ్చు.
అదీ నిజం కూడా.. కానీ ఓ నిండు ప్రాణం మాత్రం బలి అయిపోయింది. వీడియోను చూసి మిగతా వారు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.

10 నిమిషాలు లేటయితే ఏంటీ..? సిటీలోనే కాదు.. చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రెప్పపాటులో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీనికి కారణం అవగాహన లేకపోవడమే..
ఓ 5, 10 నిమిషాలు లేట్ అయితే పరిస్థితి ఏంటీ.. ఏమీ లేదు.. ఆఫీసులో అయితే బాస్ తిడతాడు. ఆర్జెంట్ పని ఉన్న చోట ఓ మాట అంటారు. మరీ వాటి కన్నా ప్రాణం ముఖ్య కదా..?
దీనిపై ఎవరికీ వారు ప్రశ్నించుకోవాలని పోలీసులు/ నిపుణులు సూచిస్తున్నారు. సో మీ ప్రాణం కోసం వారు చెబుతున్న మాటలను విని.. మీ ప్రాణాలను రక్షించుకోండి.
ఏటా రోడ్డు ప్రమాదాల వల్లే చాలా మంది చనిపోతున్నారు. అవీ తగ్గాలి. ఇందుకోసం పోలీసు శాఖ ఇప్పటికే అవగాహన చేపడుతుంది. మరిన్నీ చర్యలను తీసుకోవాల్సి ఉంది.

Leave your comment

Your email address will not be published. Required fields are marked *